Mon Dec 23 2024 05:29:16 GMT+0000 (Coordinated Universal Time)
తూ.గో. జిల్లాలో దారుణం.. మద్యంమత్తులో భర్త పురుషాంగం కోసి..
సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో అబ్బులు (46), ముత్యాలు దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ మద్యం
తూ.గో. జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. మద్యం మత్తులో తానేం చేస్తుందో తెలియక.. భర్తను అతికిరాతకంగా హత్యచేసిందో భార్య. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో అబ్బులు (46), ముత్యాలు దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. అదే అలవాటుతో.. ఇద్దరూ బుధవారం రాత్రి మద్యం తాగి.. గొడవపడి ఇంటికెళ్లారు. మర్నాడు ఉదయం ముత్యాలు మాత్రమే ఇంటివద్ద కనిపించింది.
Also Read : నాటు బాంబును కొరికిన శునకం
అబ్బులు మృతదేహాన్ని రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ముత్యాలును అబ్బులు మృతిపై ప్రశ్నించగా.. అతనికి మూర్చ వ్యాధి ఉందని, ఆ వ్యాధితోనే మరణించాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ.. మృతదేహంపై గాయాలు, పురుషాంగం కోసిన ఆనవాళ్లు కనిపించడంతో.. పోలీసులు హత్యగా నిర్థారించి కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ముత్యాలు ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో.. ఆమె హత్యానేరాన్ని అంగీకరించింది. తన భర్తను మద్యంమత్తులో తానే చంపినట్లు ఒప్పుకుంది.
Next Story