Mon Dec 23 2024 14:36:08 GMT+0000 (Coordinated Universal Time)
కామారెడ్డిలో దారుణం.. మహిళను చంపి డ్రమ్ములో కుక్కి చెరువులోకి..
సీసీ కెమెరాలను పరిశీలించిన వారు.. నర్సవ్వను ముగ్గురు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని..
ఆమె వేసుకున్న నగలే ఆమె పాలిట యమపాశాలయ్యాయి. నగలపై కన్నేసిన దుండగులు వాటికోసం ఆమె చంపేందుకు సిద్ధపడ్డారు. అనుకున్నదానిప్రకారం మహిళను చంపి, నగలు తీసుకుని, డ్రమ్ముల్లోకుక్కి.. ఆ తర్వాత చెరువులో పడేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన నర్సవ్వ సిమెంట పనులకు వెళ్తూ ఉండేంది. శనివారం బంధువులను పరామర్శించేందుకు కామారెడ్డి ఆస్పత్రికి వెళ్లింది. అలా వెళ్లిన నర్సవ్వ తిరిగి రాకపోవడంతో భర్త కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సీసీ కెమెరాలను పరిశీలించిన వారు.. నర్సవ్వను ముగ్గురు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నగల కోసం ఆమెను హత్య చేసినట్లు వెల్లడించారు. నర్సవ్వ పనికి వెళ్లే మేస్త్రీతో పాటు మరో ఇద్దరు నగల కోసం కిడ్నాప్ చేసి ఓ రూమ్ లో బంధించారు. ఆమె ఒంటిలో ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండిని దోచుకుని.. గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మహిళ శవాన్ని డ్రమ్ములో వేసి.. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి చెరువులో పడేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story