Mon Dec 23 2024 14:21:28 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ శివార్లలో దారుణం.. ఫాంహౌస్ లో మహిళ దారుణ హత్య
గుర్తుతెలియని కొందరు వ్యక్తులు మహిళను హత్యచేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం (మార్చి 3) రాత్రి జరిగిన..
హైదరాబాద్ శివార్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు మహిళను హత్యచేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం (మార్చి 3) రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకా వివరాలు ఇలా ఉన్నాయి. కందుకూరు మండలం దాసురాపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్ లో శైలజా రెడ్డి-సురేందర్ రెడ్డి దంపతులు పనిచేస్తున్నారు. ఆ ఫాంహౌస్ యజమాని కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో.. సురేందర్ రెడ్డి వారితోనే కలసి ఉన్నాడు.
శైలజా రెడ్డి మాత్రం తమకు కేటాయించిన సర్వెంట్ క్వార్టర్ లో ఉంది. రాత్రి 8.30 గంటల సమయంలో ఆ ప్రాంతంలో కుక్కలు నిర్విరామంగా అరుస్తుండటంతో.. సురేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్ వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ తన భార్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి.. బోరున విలపించాడు. యజమాని కుటుంబ సభ్యులు వచ్చి చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయి.
Next Story