Mon Dec 23 2024 09:00:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్ స్టాలో పరిచయం, ప్రేమ.. హెటల్లో అత్యాచారం
ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల మహిళ, నిందితుడిగా పేర్కొన్న సుందర్ లు ఇన్ స్టా గ్రామ్ లో స్నేహితులయ్యారు. రోజులు గడిచే
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలకు లెక్కలేదు. సైబర్ నేరాలే అనుకుంటే పొరపాటే. సోషల్ మీడియాలో ఆడపిల్లలకు వల వేయడం. వారిని మాటలతో మభ్యపెట్టి, ప్రేమలోకి దింపి, అవసరం తీరాక ముఖం చాటేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగులోకొచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి మోసం చేశాడంటూ 25 ఏళ్ల మహిళ గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది.
Also Read : హ్యాకింగ్ కు గురైన ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల మహిళ, నిందితుడిగా పేర్కొన్న సుందర్ లు ఇన్ స్టా గ్రామ్ లో స్నేహితులయ్యారు. రోజులు గడిచేకొద్ది వారి స్నేహం బలపడింది. అదికాస్తా ప్రేమగా మారింది. సుందర్ ఆమెకు ప్రపోజ్ చేయగా.. ఆమె అంగీకరించింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇద్దరూ కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సుందర్.. ఆమెను భోయిగూడ రైల్వే ఆఫీసర్స్ కాలనీ సమీపంలోని ఓ హెటల్ కు తీసుకెళ్లి రెండ్రోజులపాటు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఇటీవల ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. సుందర్ అందుకు నిరాకరించాడు. ఆమె నుంచి తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గోపాలపురం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు అత్యాచారం, మోసం తదితర నేరాల కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story