Thu Dec 19 2024 17:01:01 GMT+0000 (Coordinated Universal Time)
అతనికి 60, ఆమెకు 55.. బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసింది
వీరి మధ్య సంబంధం 10 ఏళ్లుగా సాగుతోంది. కాగా.. ఇటీవల వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన చిక్కులతో పాటు..
వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. పెళ్లైన మహిళ లేదా పురుషుడు.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఫలితంగా అది ఒకరి ప్రాణాలు పోవడానికి.. తమ ప్రాణాలు తీసుకోడానికి కారణమవుతోంది. తాజాగా ఓ మహిళ.. తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని కొండపి మండలం మూగచింతల గ్రామంలో జరిగిన ఈ ఘటన.. మూడ్రోజుల తర్వాత వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
మూగచింతలలో బాధితుడైన 60 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామంలో ఉంటున్న 55 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరి మధ్య సంబంధం 10 ఏళ్లుగా సాగుతోంది. కాగా.. ఇటీవల వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన చిక్కులతో పాటు.. మరికొన్ని సమస్యలొచ్చి పడ్డాయి. దాంతో వారిద్దరి మధ్యనున్న సాన్నిహిత్యం బీటలు వారింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి మర్మాంగాన్ని మహిళ కోసేసింది. ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన పొరుగువారు.. జరిగిన ఘటన చూసి షాకయ్యారు. వెంటనే బాధితుడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story