Mon Dec 23 2024 02:28:18 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లివేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ
వారితో పాటు నృత్యం చేస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలు కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు ఎంత లేపినా స్పృహలోకి రాకపోవడంతో..
కొందరు మనం చూస్తుండగానే కుప్పకూలిపోతుంటారు. డ్యాన్స్ చేస్తూ, పాటపాడుతూ గతంలోనూ కొందరు మరణించిన ఘటనలున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్ లో ఓ వివాహవేడుకలో నృత్యం చేస్తూ 60 ఏళ్ల మహిళ కుప్పకూలిపోయింది. సియోని జిల్లా బఖారీ గ్రామంలో బుధవారం రాత్రి ఓ వివాహా వేడుకలో కచేరి జరిగింది. ఆ సమయంలో కొందరు మహిళలు స్టేజిపైకి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు.
వారితో పాటు నృత్యం చేస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలు కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు ఎంత లేపినా స్పృహలోకి రాకపోవడంతో.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుడు మహిళను పరిశీలించి.. ఆమె గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో ఓ వ్యక్తి గర్భా నృత్యం చేస్తూ, మరొక వ్యక్తి పాట పాడుతూ చనిపోయారు. ఇటీవల ఓ పెళ్లివేడుకలో పెళ్లికూతురు కూడా గుండెపోటుతో మరణించింది. ఇలాంటి హఠాన్మరణాలు ఉద్వేగానికి, అధిక ఆనందానికి లోనైనపుడు జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Next Story