Sun Dec 22 2024 11:32:53 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ లో వీడియో చూసి భార్యకు కాన్పు చేసిన భర్త.. ఎంత పనైందంటే..!
యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నించగా
యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నించగా.. ఆమె ప్రాణాలు పోయాయి. ప్రసవం తరువాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. సహజసిద్ధంగా ప్రసవం జరగాలని భార్యభర్తలు భావించారు.. కానీ అనుకోని విషాదం ఆ జంటను వెంటాడింది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్కు(27) పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు. లోకనాయకి ఇటీవల గర్భం దాల్చింది. వారు ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. మాదేశ్ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయంపై తనకు పట్టు ఉందని భావించేవాడు. మంగళవారం లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్ తన ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది.
Next Story