Sat Dec 21 2024 01:58:50 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. బైక్ పై మరో యువతి కూడా..
హోటల్ దగ్గర బయలుదేరినపుడు స్కూటీని నిధి నడుపుతోందని.. దారి మధ్యలో సీట్లు మార్చుకుని స్కూటీని అంజలి డ్రైవ్ చేసిందని..
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డుప్రమాదం.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శనివారం అర్థరాత్రి దాటాక 1.45 గంటల సమయంలో స్కూటీపై యువతి, తన స్నేహితురాలు ఓ హోటల్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ముగిశాక వెళ్తున్నట్లు సీసీటీవీలో గుర్తించారు. ఈ క్రమంలో.. స్కూటీని ఢీ కొట్టిన కారు.. ఆ యువతిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాలతో మరణించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని అంజలి సింగ్ గా గుర్తించారు పోలీసులు.
ఆ సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా స్కూటీపై ఉందని, ఆమె స్నేహితురాలు నిధి స్వల్ప గాయాలతో బయట పడింది. ఆ తర్వాత భయంతో అక్కడి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. హోటల్ దగ్గర బయలుదేరినపుడు స్కూటీని నిధి నడుపుతోందని.. దారి మధ్యలో సీట్లు మార్చుకుని స్కూటీని అంజలి డ్రైవ్ చేసిందని వివరించారు. నిధి ఆచూకీని కనుగొన్నామని, ప్రమాదం జరిగిన తీరుపై ఆమెను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదానికి కారణమైన ఐదుగురు యువకులు పోలీసుల విచారణలో.. తాము మద్యం మత్తులోనే ప్రమాదం చేసినట్లు అంగీకరించారు. అయితే.. కారుకింద ఏదో ఉందని ఐదుగురిలో ఒకడైన దీపక్ చెప్పగా.. మిగతా నలుగురు అతని మాటల్ని కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.
Next Story