Mon Dec 23 2024 16:36:27 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రోస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా.. ఫలితం లేకపోయింది. మహిళ మరణించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
హైదరాబాద్ లోని మెట్రోస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రగడ్డలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ పై నుండి దూకిన మహిళలకు తీవ్రగాయాలు కావడంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. బుధవారం ఉదయం.. మెట్రో స్టేషన్ వద్దకు వచ్చిన ఓ మహిళ.. కొద్దిసేపు అక్కడే ఉండి.. స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చూసిన ప్రయాణికులంతా షాకయ్యారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా.. ఫలితం లేకపోయింది. మహిళ మరణించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మహిళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్థిక సమస్యలే మహిళ ఆత్మహత్యకు ప్రధాన కారణమని, ప్రాథమిక విచారణలో గుర్తించారు. మారెమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా.. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న రోజులివి. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమే కాకుండా.. తన వాళ్లను ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోతున్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఎన్ని అవగాహనలు కల్పించినా.. ఆలోచన తీరులో మార్పు రావడం లేదు.
Next Story