Mon Dec 23 2024 16:48:04 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఉరికి వేలాడుతూ కనిపించిన నర్స్.. గ్యాంగ్ రేప్..?
ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టంకు
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వెనుక ఇనుప కడ్డీకి వేలాడుతున్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె చనిపోవడానికి ఒక రోజు ముందు ఆసుపత్రిలో ఉద్యోగంలోకి చేరిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన దుల్లపూర్వా గ్రామంలోని న్యూ జీవన్ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలిని టికానా గ్రామానికి చెందిన నజియా (19)గా గుర్తించారు. నర్సుగా పని చేసేందుకు శుక్రవారం ఆమె ఆస్పత్రికి వచ్చింది. మరుసటి రోజు నజియా మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది కనుగొన్నారు. కొత్తగా తెరిచిన ఆసుపత్రి సముదాయం వెనుక గోడ నుండి ఇనుప కడ్డీకి వేలాడుతూ ఉంది. ఆమె ముఖానికి ముసుగు ఉంది. రుమాలు లాంటి గుడ్డ ఆమె చేతుల్లో ఉంది.
ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టంకు తరలించారు. శుక్రవారం రాత్రి నజియా ఆస్పత్రిలోనే నిద్రిస్తోందని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఆసుపత్రి వెనుక వేలాడదీశారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నజియా తల్లి ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురిపై పోలీసులు సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. న్యూ జీవన్ ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీకాంత్ కటియార్ ఏప్రిల్ 25న ప్రారంభించారు.
Next Story