Mon Dec 15 2025 06:38:10 GMT+0000 (Coordinated Universal Time)
మహబూబాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతి మృతి
తనకు జరిగిన అవమానాన్ని భరించలేని యువతి.. తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నలుగురి పేర్లు సూసైడ్ నోట్ లో రాసి..

మహబూబాబాద్ : ఆడపిల్లల రక్షణకై ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమంది నేరగాళ్లకు శిక్షలు వేసినా, ఎన్ కౌంటర్లు చేసినా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావట్లేదు. మనిషి రూపంలో సమాజంలో తిరుగుతూ.. ఒంటరిగా కనిపించిన ఆడవాళ్లపై కన్నేసి.. వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతి(23)పై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తనకు జరిగిన అవమానాన్ని భరించలేని యువతి.. తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నలుగురి పేర్లు సూసైడ్ నోట్ లో రాసి ఈనెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన బంధువులు వెంటనే ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 5 రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడిన యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. పోలీసులు యువతి మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచి బందోబస్త్ ఏర్పాటు చేశారు. గ్యాంగ్ రేప్ గురించి బయటికి తెలియకుండా.. రహస్యంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

