Mon Dec 23 2024 12:11:43 GMT+0000 (Coordinated Universal Time)
రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారం.. స్పందించిన సీఎం
అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్లో దిగారు. అర్థరాత్రి కావడంతో..
రేపల్లె : బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు దుండగులు బాధిత మహిళ భర్తను కొట్టి, ఆమెపై అత్యాచారం చేసినట్లు దంపతులు చెప్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్లో దిగారు. అర్థరాత్రి కావడంతో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేక రైల్వే స్టేషన్లోని బల్లలపైనే పడుకున్నారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి, బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
భార్యపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న దుండగులను భర్త అడ్డుకోబోగా.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దంపతులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందినవారుగా గుర్తించారు. దంపతులు ఇచ్చిన వివరాలు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫోన్ చేసి, కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే రేపల్లె రైల్వే స్టేషన్ వద్ద పరిసరాలను పరిశీలించి, స్థానికులను కూడా విచారించినట్లు తెలుస్తోంది.
Next Story