Sun Dec 22 2024 22:13:26 GMT+0000 (Coordinated Universal Time)
భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో సహా బావిలో దూకిన భార్య.. చివరికి ఇలా
ఇంటికి సమీపంలో ఉన్న బావివద్దకు వెళ్లి.. ముందు నలుగురు పిల్లల్నీ బావిలోకి తోసేసింది. బతుకుపై ఆశపుట్టి..
క్షణిక ఆవేశంలో కొందరు చేసే పనులతో కొన్ని జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతాయి. ఇది కూడా అలాంటి ఘటనే. భర్తతో గొడవ జరగడంతో మనస్తాపంతో నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకింది ఓ మహిళ. తీరా దూకేశాక బతుకుపై ఆశపుట్టి బావిలోకి వేలాడుతున్న తాడు సహాయంతో పెద్దబిడ్డను తీసుకుని పైకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
భర్తతో జరిగిన గొడవతో తీవ్రమనస్తాపం చెందిన ప్రమీలా.. ఇక బ్రతకకూడదు అనుకుంది. తానులేకుండా తన నలుగురు పిల్లలు కష్టాలుపడతారని భావించి వాళ్లను కూడా తనవెంటే తీసుకెళ్లాలనుకుంది. ఇంటికి సమీపంలో ఉన్న బావివద్దకు వెళ్లి.. ముందు నలుగురు పిల్లల్నీ బావిలోకి తోసేసింది. బతుకుపై ఆశపుట్టి బావిలోకి వేలాడుతున్న తాడు సహాయంతో పెద్దబిడ్డను తీసుకుని పైకి వచ్చింది. మిగతా ముగ్గురు పిల్లలూ బావిలోనే ఉండిపోయారు. ఆ ముగ్గురిని కాపాడే సరికి కన్నుమూశారు. మృతుల్లో 18 నెలల కుమారుడు, 3, 5 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ప్రమీల, ఆమె కుమార్తె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.
Next Story