Thu Dec 19 2024 16:06:18 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో దారుణం.. తమ్ముడి కూతుర్ని చంపి ఆపై..
సర్దుకుపోయి కాపురం చేయాలని ఆమెకు ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పుట్టినింటికి వెళ్లి.. తమ్ముడి పై ఆధారపడింది. కొంతకాలానికి..
ఏపీలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాలతో నరబలులు ఇవ్వడం చూసుంటాం.. కానీ పసిపిల్లల్ని చంపి.. వారి రక్తాన్ని తాగడం ఎక్కడా చూసి ఉండం. కనీసం అలాంటి వార్త చెవిన కూడా పడి ఉండదు. ఇలాంటి దారుణ, క్రూరమైన ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. ఈ ఘటనతో విశాఖ జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. నరరూప రాక్షసి తమ మధ్యే ఇన్నాళ్లూ తిరిగిందని తెలిసిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో గొడవపెట్టుకుని విడిపోయింది.
సర్దుకుపోయి కాపురం చేయాలని ఆమెకు ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పుట్టినింటికి వెళ్లి.. తమ్ముడి పై ఆధారపడింది. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అతని భార్యకు, మహిళకు ఇద్దరికీ తరచూ గొడవ జరిగేది. అది మనసులో పెట్టుకున్న మహిళ.. తమ్ముడి కూతుర్ని కొండపైకి తీసుకెళ్లి గొడ్డలితో అతి దారుణంగా చంపేసింది. అంతటితో ఆగకుండా పాప రక్తాన్ని తాగేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఖంగుతిన్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story