Fri Dec 20 2024 17:19:06 GMT+0000 (Coordinated Universal Time)
నిత్య పెళ్లి కూతురు.. యాభై మందితో పెళ్లి చేసుకుని మరీ?
తమిళనాడులో యాభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది ఒక యువతి
ఒకరు రెండో పెళ్లి చేసుకుంటేనే వెంటనే దొరికిపోతున్నారు. అలాంటి ఈరోజుల్లో యాభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది నిత్య పెళ్లకూతురు. ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. తమినాడులో ఈ ఘటన చోటుకుంది. తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది.
పెళ్లి కాని యువకులను...
తమిళనాడు- తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి, పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. సంధ్య వలల్లో డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు అని తెలిసి అవాక్కవ్వడం పోలీసుల వంతయింది. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ యువతి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story