Mon Dec 23 2024 18:29:53 GMT+0000 (Coordinated Universal Time)
వివాహితకు ప్రియుడి వేధింపులు.. ఫేస్ బుక్ ఫ్రెండ్ తో హత్యచేయించిన మహిళ
బాగ్ అంబర్ పేటకు చెందిన యశ్మకుమార్(32) ఫొటోగ్రాఫర్. అతనికి 2018లో మీర్ పేట ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేతారెడ్డి(32) అనే
హైదరాబాద్ : ఇద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత మాటలు కలిసి.. ప్రేమించుకున్నారు. న్యూడ్ కాల్స్ మాట్లాడుకున్నారు. తనను పెళ్లిచేసుకోవాలని కోరాడు ప్రియుడు. కానీ.. అప్పటికే ఆమెకు పెళ్లైపోయింది. కుదరదని ఎంతచెప్పినా వినకపోవడంతో మరో ఫేస్ బుక్ ఫ్రెండ్ ద్వారా ప్రియుడిని హత్యచేయించింది ఆ మహిళ. ఈ కేసులో మహిళ సహా మరో ఇద్దరిని మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాగ్ అంబర్ పేటకు చెందిన యశ్మకుమార్(32) ఫొటోగ్రాఫర్. అతనికి 2018లో మీర్ పేట ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేతారెడ్డి(32) అనే మహిళ ఫేస్ బుక్ లో పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకుంటున్న వీరిద్దరి మధ్య చనువు పెరగడంతో యశ్మకుమార్ శ్వేతను నగ్నంగా వీడియో కాల్ చేయాలని అడిగాడు. అతని కోరిక మేరకు శ్వేత వీడియో కాల్ చేసింది.
ఆ వీడియో కాల్ ను రికార్డు చేసిన యశ్మకుమార్.. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే.. వీడియోను నెట్టింట్లో పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. నెలరోజులుగా వేధింపులు ఎక్కువవడంతో శ్వేతారెడ్డి ఫేస్ బుక్ లో పరిచయమైన కొంగల అశోక్ (28)కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించింది. యశ్మకుమార్ ను హతమార్చాలని చెప్పింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలానికి చెందిన అశోక్ మే 4వ తేదీన హైదరాబాద్ కు వచ్చి, కార్తీక్ అనే మరో వ్యక్తితో కలిసి యశ్మకుమార్ ను దారుణంగా కొట్టి.. పరారయ్యారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యశ్మకుమార్ మే6న మృతి చెందగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి సీసీ ఫుటేజీల సహాయంతో కేసు మిస్టరీని చేధించారు. నిందితులైన శ్వేతారెడ్డి, అశోక్, కార్తీక్ లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
Next Story