Sat Dec 21 2024 04:53:02 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా పోలీస్ కానిస్టేబుల్ ను హతమార్చిన ప్రియుడు
పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఖాళీ కాట్రిడ్జ్ లు, మొబైల్ ఫోన్లను..
తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్ లోని కతిహార్ జిల్లా సమీపంలోని భట్వారా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రభకుమారి అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. బుధవారం (ఫిబ్రవరి 8) రాత్రి 8 గంటల సమయంలో ప్రభకుమారి తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో మోటర్ సైకిల్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ప్రభకుమారి తలకు గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఖాళీ కాట్రిడ్జ్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ప్రభకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కతిహార్ ఆస్పత్రికి తరలించారు. ప్రభకుమారి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. ప్రభ కుమారికి చోటు అలియాస్ అర్షద్ మధ్య లవ్ అఫైర్ ఉందని, కొద్దిరోజులుగా అతడిని ప్రభ దూరం పెట్టడంతో ఆమెను చంపేస్తానని ఫోన్లో అతడు పలుమార్లు బెదిరించినట్లు ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో అర్షద్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
- Tags
- bihar
- love affair
Next Story