Mon Dec 23 2024 18:10:50 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో దారుణం.. 10 మందీ చూస్తుండగానే వివాహితపై..
గ్రామానికి చెందిన మహిళ సమీపంలోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ..
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో సమాజం సిగ్గుతో తలొంచుకునే దారుణ ఘటన జరిగింది. కళ్లెదుటే ఓ అబలపై దారుణానికి పాల్పడుతుంటే.. అడ్డుకోవాల్సిన వారు చూస్తుండిపోయారు. పట్టపగలు, 10 మందీ చూస్తుండగానే ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. సంగం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మహిళ సమీపంలోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సారా తాగిన మత్తులో ఓ యువకుడు ఆ ప్రాంతానికి వెళ్లాడు. మహిళను చూసి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాపాడాలంటూ మహిళ కేకలు వేసినా.. చుట్టుపక్కల పశువులను కాస్తున్న వారు ఎవరూ ఆమెను రక్షించేందుకు ముందుకి రాలేదు. విషయం తెలుసుకున్న నిందితుడి భార్య.. అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో బాధిత మహిళ తప్పించుకుంది. కాగా.. గతంలో కూడా ఆ ప్రాంతంలో పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై అఘాయిత్యాలు జరిగినట్లు తెలుస్తోంది. తాజా ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందకపోయినా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story