Mon Dec 23 2024 09:13:02 GMT+0000 (Coordinated Universal Time)
భర్త అనుకుని రోజూ చాటింగ్.. ప్రైవేటు ఫొటోలు సెండ్ చేసింది.. తీరా చూస్తే !
ఒక రోజు అతను కోరిక మేరకు తన పర్సనల్ ఫొటోలను పంపింది. మూడు నెలలు గడిచిపోయాయి. మరొకరోజు అదేపనిగా ఫొటోలు..
ముంబై : భర్త అనుకుని రోజూ చాటింగ్ చేసింది. పర్సనల్ ఫొటోలు పంపమంటే.. భర్తే కదా అని పంపించింది. తీరా చూస్తే.. అది తన భర్త నుంచి వచ్చిన రిక్వెస్ట్ కాదని తెలిసిన ఆ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని మలాడ్ దిన్ దోషి ఏరియాలోని అపార్ట్ మెంట్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఓ రోజు భార్య ఇన్ స్టా అకౌంట్ కు భర్త పేరుతో ఉన్న ఇన్ స్టా అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. పంపింది భర్తే అనుకుని యాక్సెప్ట్ చేసింది. అప్పట్నుంచి రోజూ చాటింగ్ చేస్తోంది.
ఒక రోజు అతను కోరిక మేరకు తన పర్సనల్ ఫొటోలను పంపింది. మూడు నెలలు గడిచిపోయాయి. మరొకరోజు అదేపనిగా ఫొటోలు పంపాలంటూ రిక్వెస్ట్ లు వచ్చాయి. అనుమానం వచ్చిన భార్య.. భర్తపై చిరాకుపడింది. ఫొటోలు పంపకపోతే.. అంతకుముందు పంపిన వాటిని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. సాయంత్రం భర్త ఆఫీసు నుంచి రాగానే నిలదీసింది. దాంతో అసలు విషయం తెలిసి ఆమె కంగారు పడింది. తనకు అసలు ఇన్ స్టా అకౌంటే లేదని భర్త చెప్పడంతో.. ఎవరో తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలుసుకుని వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య భర్తలు.
కేసు నమోదు చేసుకుని, రంగంలోకి దిగిన పోలీసులు.. బాధిత మహిళ చాటింగ్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా కూపీ లాగగా.. అది వారి పక్కప్లాట్ లో 20 ఏళ్ల కుర్రాడి అకౌంట్ అని తేలింది. ఇన్ స్టా లో అతను నడిపిన వ్యవహారం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు పోలీసులు. సదరు మహిళ అకౌంట్ లో ఉన్న భర్త ఫొటోను సేకరించి, అతని పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు రిక్వెస్ట్ పంపినట్లు తెలిపాడు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదంతో మహిళ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయాటానికే ఈ వికృతచేష్టలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు పంపించారు.
Next Story