Mon Dec 23 2024 11:32:02 GMT+0000 (Coordinated Universal Time)
నా కడుపులో బిడ్డకు తండ్రి.. ఆ బీజేపీ ఎమ్మెల్యేనే - మహిళ ఆరోపణ
సదరు మహిళ తనకు 2009లో పరిచయం అయిందని, 2013లో ఒకసారి తనను కలిసి భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరిందని
రాజకీయ నాయకులన్నాక.. ఏదొక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు అలాంటి పరిస్థితే ఎదురయింది. ఓ మహిళ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ.. ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్ తెల్కూర్ పై ఆరోపణలు చేసింది. అతనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ ఆరోపణలను రాజ్ కుమార్ ఖండించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, ఆమె కావాలనే నామీద ఆరోపణలు చేస్తుందని వాపోయారు.
సదరు మహిళ తనకు 2009లో పరిచయం అయిందని, 2013లో ఒకసారి తనను కలిసి భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన కొడుకు చదువుకు సహాయం కావాలని కోరగా.. చేస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంతకుమించి ఆమెతో వేరే సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్తున్నారు. ఆమె ఇలా బెదిరించడం ఇది మొదటిసారి కాదని, గతంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. ఆ ప్లాన్ రివర్స్ అవ్వడంతో ఇప్పుడిలా ఆరోపణలు చేస్తోందంటున్నారు. ఇందులో నిజానిజాలేమిటో.. పోలీసులు విచారణ చేస్తే గాని తెలియదంటున్నారు పార్టీ నేతలు.
Next Story