Mon Dec 23 2024 10:46:38 GMT+0000 (Coordinated Universal Time)
భర్తను తగలబెట్టిన భార్య.. కారణం ఏమి చెబుతోందంటే..?
రాత్రి ఓ మహిళ తన భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా డివిజన్లోని మధుర జిల్లాలో సోమవారం రాత్రి ఓ మహిళ తన భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించింది. 80 శాతం కాలిన గాయాలతో ఆ వ్యక్తి మంగళవారం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. ఈ సంఘటన కోసికలన్ పట్టణంలో చోటు చేసుకుంది.
రేఖ అనే మహిళకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె భర్త చమన్ ప్రకాష్ కు భార్యపై అనుమానం వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టేవాడు. సోమవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగి, రాత్రి చమన్ ప్రకాష్ గాఢనిద్రలో ఉన్న సమయంలో రేఖ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. దీంతో ప్రకాష్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన చమన్ ప్రకాష్ ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. "కోసి కలాన్‌లోని మీనా నగర్ కాలనీకి చెందిన మృతుడు చమన్ ప్రకాష్ కుటుంబం నుండి పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. రేఖపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయబడింది" అని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనుజ్ కుమార్ తెలిపారు.
News Summary - Woman sets husband on fire in Mathura after argument over affair
Next Story