Mon Dec 23 2024 20:06:30 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో మరో దారుణం.. మహిళా టెకీపై షాపింగ్ మాల్ లో అత్యాచారం
గత శనివారం (ఫిబ్రవరి 11) సహారా మాల్ లో ఇంటర్వ్యూ ఉందని, అక్కడకు రావాలని తెలిపాడు. తుషార్ చెప్పినట్టే ఆమె తన..
దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. షాపింగ్ మాల్ సెల్లార్ లో ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటన తాజాగా బయటపడింది. తుషార్ శర్మ అనే వ్యక్తి తనకు మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్ లైన్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు తుషార్ పరిచయమయ్యాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తుషార్ నమ్మించాడు.
గత శనివారం (ఫిబ్రవరి 11) సహారా మాల్ లో ఇంటర్వ్యూ ఉందని, అక్కడకు రావాలని తెలిపాడు. తుషార్ చెప్పినట్టే ఆమె తన డాక్యుమెంట్లు తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు ఆ మాల్ వద్దకు చేరుకుంది. ఆమెను తనకారులో ఎక్కించుకుని బేస్ మెంట్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడిచ్చిన మంచినీళ్లు తాగానని, వెంటనే స్పృహ కోల్పోతుండగా.. తుషార్ తనను బలవంతంగా కారులోకి తోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి.. అక్కడి నుండి వెళ్లిపోయాడని యువతి వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడటం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. మాల్ బేస్ మెంట్ లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story