Mon Dec 23 2024 06:15:24 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. యువతిని చంపి.. నగ్నంగా డంప్ లో పడేసిన వైనం
కాగా.. మృతురాలి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే బాధిత యువతి ఎవరు ?
మీరట్‌లోని ఖర్ఖోడా ప్రాంతంలో ఆదివారం ఉదయం ముఖంపై గాయాల గుర్తులతో నగ్నంగా ఉన్న మహిళ శరీరంతో కూడిన గోనె సంచిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక వ్యక్తి తన భుజాలపై గోనె సంచిని మోసుకెళ్లి డంప్ చేయడానికి స్థలం కోసం వెతుకుతున్నట్లు పోలీసులు ఆ ఫుటేజీలలో గుర్తించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా.. మృతురాలి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే బాధిత యువతి ఎవరు ? ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని తిరిగిన వ్యక్తి ఎవరన్న వాటిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. యువతి వివరాలను కనుగొనేందుకు మీరట్ లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కంప్లైంట్లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మీరట్ రూరల్ ఎస్పీ అనిరుధ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాధిత యువతిని, నిందితుడిని గుర్తించలేకపోయామన్నారు. ఆమె శరీరంపై గొంతు నులిమిన గాయాలు, నోటి చుట్టూ రక్తపుమచ్చలున్నట్లు గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపినట్లు పేర్కొన్నారు.
- Tags
- meerut
- crime news
Next Story