Thu Dec 19 2024 15:27:44 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. స్కూల్ టాపర్ ను హతమార్చిన మరో విద్యార్థిని తల్లి
కంగారు పడిన మణికంఠన్ తల్లిదండ్రులు.. వెంటనే అడిని కారైకల్ లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ..
స్కూల్ టాపర్ ను హతమార్చింది మరో విద్యార్థిని తల్లి. తన కూతురికంటే మరో విద్యార్థికి ఎక్కువ మార్కులొస్తున్నాయని ఏకంగా ఆ విద్యార్థిని ప్రాణాలతోనే లేకుండా చేసిందా తల్లి. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. కూల్ డ్రింక్ లో విషమిచ్చి ఆ బాలుడిని కానరానిలోకాలకు పంపేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు పుదుచ్చేరిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ - మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్ నెహ్రూనగర్‌లోని ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ కి వెళ్లొచ్చిన తర్వాత అతను వాంతులు చేసుకుని, కళ్లు తిరిగిపడిపోయాడు.
కంగారు పడిన మణికంఠన్ తల్లిదండ్రులు.. వెంటనే అడిని కారైకల్ లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మణికంఠన్ మరణించాడు. అతను తాగిన కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉండటం వల్లే చనిపోయాడని తెలియడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాను పరిశీలించడంతో.. అసలు విషయం బయటపడింది. తన కూతురు క్లాస్ ఫస్ట్ రాకపోవడానికి కారణం మణికందన్ అని భావించి .. సహాయరాణి విక్టోరియా అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితురాలిని కారైకాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. ఉదయం 11:00 గంటల సమయంలో విద్యార్థి బయటకు రాగా.. డ్యూటీలో ఉన్న వాచ్మెన్ తో బాల మణికందన్‌కు కూల్ డ్రింక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాల మణికందన్ తన కూతురు కంటే బాగా చదువుతున్నాడని, ప్రస్తుత పరీక్షల్లో అతను క్లాస్ ఫస్ట్ రావడంతో ఈ దారుణానికి పాల్పడిందన్నారు.
Next Story