Fri Nov 22 2024 20:00:29 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నం పోలీసు స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్య
విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రావణి అనే యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో శ్రావణి దంపతులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా, బయటకు వచ్చిన శ్రావణి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. దీంతో శ్రావణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడబోయిన ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది.
విశాఖపట్నంకు చెందిన వినయ్‌కు గుంటూరుకు చెందిన శ్రావణితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే శ్రావణి.. బుధవారం ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యభర్తలు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు స్టేషన్‌కు పిలించారు. ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళ్లిన శ్రావణి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శ్రావణి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వినయ్‌కు మద్యం అలవాటు కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది.
Next Story