Fri Dec 20 2024 01:34:52 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. మహిళా వాలంటీర్ దారుణ హత్య
జిల్లాలోని వేమూరు మండలం చావలి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల..
బాపట్ల : జిల్లాలో విషాద ఘటన జరిగింది. మహిళా వాలంటీర్ దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని వేమూరు మండలం చావలి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాలపల్లికి చెందిన దొప్పలపూడి శారద అనే మహిళ వాలంటీర్ గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన మద్ది పద్మారావు అనే వ్యక్తి వాలంటీర్ శారద గొంతుకోసి నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. వాలంటీర్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వాలంటీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న పద్మారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వాలంటీర్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా ? లేక మరేదైనా కారణాలున్నాయా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story