Thu Dec 19 2024 10:59:44 GMT+0000 (Coordinated Universal Time)
మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ.. ఆటో డ్రైవర్ ఘాతుకం
తమదైన శైలిలో రాజుని విచారించగా.. రేసు గోపిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో..
కొద్దిరోజుల క్రితం విశాఖలో అదృశ్యమైన ఓ మహిళ.. శవమై కనిపించింది. ఆమెకు బాగా పరిచయస్తుడైన వ్యక్తే ఆమెను హతమార్చాడు. విశాఖ తగరపువలస బాలాజీ నగర్ కు చెందిన రేసు గోపి అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. తన ఏడేళ్ల బాబుతో కలిసి ఆమె నివాసముంటోంది. ఇటీవల ఓ శుభకార్యానికి వెళ్లిన ఆమె.. ఎంతకూ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో బంధువులు మే1న భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మే 2న మిస్సింగ్ కేసు నమోదైంది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బంధువులు అనుమానిస్తున్న చేపలుప్పాడకు చెందిన ఆటోడ్రైవర్ మైలిపల్లి రాజును అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో రాజుని విచారించగా.. రేసు గోపిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో పడేసినట్లు చెప్పగా.. అక్కడికి వెళ్లి చూశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం రేసు గోపిదేనని బంధువులు నిర్థారించగా.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు. రేసు గోపీకి ఆటోడ్రైవర్ తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. అది ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల శుభకార్యం వద్ద ఒకరికొకరు ఎదురుపడగా.. మాట్లాడుకున్నారు. ఆమెవద్ద బంగారం కొట్టేయాలని భావించిన రాజు.. మాటలతో నమ్మించి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆటో స్టార్ట్ చేసేందుకు వినియోగించే తాడుతో మెడ బిగించి హత్యచేశాడు.
Next Story