Mon Dec 23 2024 14:54:33 GMT+0000 (Coordinated Universal Time)
యువతులకు తాంత్రికుడి ఎర.. నగ్నంగా క్షుద్రపూజలు
తన మాటలు గుడ్డిగా నమ్మిన వారితో క్షుద్రపూజలు చేయించేవాడు. ఈక్రమంలో చిలకలూరిపేటకు చెందిన
టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా.. ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారు. ఏవో పూజలు చేస్తే ఏవేవో జరుగుతాయన్న మూఢనమ్మకాలతో ఉంటున్నారు. అలా ఓ తాంత్రికుడి మాటలు గుడ్డిగా నమ్మిన యువతులు.. నగ్నంగా పూజలు చేశారు. ఆపై ఆ తాంత్రికుడు యువతులపై అత్యాచారం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. క్షుద్రపూజల నేపథ్యంలో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగినట్లు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రతంత్రాలతో డబ్బులు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి మభ్యపెట్టేవాడు. తన మాటలు గుడ్డిగా నమ్మిన వారితో క్షుద్రపూజలు చేయించేవాడు. ఈక్రమంలో చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ ఈజీగా డబ్బు సంపాదించేందుకు మార్గం చెప్పాలని ఆ తాంత్రికుడిని ఆశ్రయించింది. సోషల్ మీడియా ద్వారా అతడితో పరిచయం పెంచుకున్న ఆమె.. పూర్తిగా అతని మాయలో పడిపోయింది.
ఆ మహిళ సాయంతో మహిళలకు వలవేసి క్షుద్రపూజలు చేశాడు. కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు యువతులకు డబ్బు ఆశచూపి 10 రోజులపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని హోటల్స్ రూమ్ లలో నూలు పోగు లేకుండా నగ్నంగా పూజలు చేయించాడు. డబ్బులు ఇవ్వకుండానే వారిని తిరిగి కర్నూల్ కు పంపేశాడు. తమకు ఇస్తామని చెప్పిన డబ్బు ఇవ్వపోవడంతో ఆ యువతులు పొన్నెకల్లుకు వెళ్లి తాంత్రికుడిని నిలదీశారు. ఈ క్రమంలో అమ్మాయిలను ఆ తాంత్రికుడు, మహిళ కలిసి ఓ వాహనంలో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లబోయారు.
గోరంట్ల సమీపంలో వాహనం ఆగగా.. యువతులు వారి బారి నుండి తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేశారు. తాంత్రికుడి నుంచి తప్పించుకున్న యువతులను పోలీసులు రక్షించారు. తాంత్రికుడు తప్పించుకోగా.. ఆ మహిళను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న తాంత్రికుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story