Wed Apr 09 2025 21:52:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇజ్రాయిల్ లో కాల్పులు..ఐదుగురి మృతి
ఇజ్రాయిల్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇజ్రాయిల్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సెంట్రల్ ఇజ్రాయిల్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. బైక్ వచ్చిన దుండగుగు కాల్పులు జరపడంతో ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీశారు. అయితే పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి దుండగుడిని కాల్చి చంపారని తెలసింది.
పాలస్తీనియన్ గా...
అయితే కాల్పులకు కారణాలు తెలియరాలేదు. కాల్పులు జరిపిన దుండగుడు మాత్రం వెస్ట్ బ్యాంక్ కు చెందిన పాలస్తీనియన్ గా పోలీసులు గుర్తించారు. రంజాన్ సమీపిస్తున్న తరుణంలో కాల్పులు ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంం ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story