Wed Jan 15 2025 05:12:01 GMT+0000 (Coordinated Universal Time)
నల్లగొండ జిల్లాలో కలకలం ...అమ్మ వారి కాళ్ల దగ్గర మొండెం లేని తల
నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం విరాటనగర్ మెట్టు మహంకాళి ఆలయంలో దుర్ఘటన జరిగింది
నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం విరాటనగర్ మెట్టు మహంకాళి ఆలయంలో మొండెంలేని తలను స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కు వెళ్లే ప్రధాన రహదారిపైనే ఈ ఆలయం ఉంది.
బలి ఇచ్చారా?
మెట్టు మహంకాళి అమ్మవారి కాళ్ల దగ్గర ఒక వ్యక్తి తలను నరికి పడేసి ఉండటం భయాందోళనకు గురి చేస్తుంది. తలలేని మొండేన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మొండెం ఎక్కడ ఉందన్న విషయంపై పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఏదైనా చేతబడి, బలి వంటి వాటికోసమే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story