Fri Dec 20 2024 14:26:01 GMT+0000 (Coordinated Universal Time)
బిర్యాని కోసం వెళితే దొంగ అనుకుని చంపేశారు
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం వెళ్లిన యువకుడిని దొంగ అనుకుని చితకబాదారు
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం వెళ్లిన యువకుడిని సిబ్బంది దొంగ అనుకుని చితకబాదారు. ఈ ఘటనలో ఆ యువకుడు మృతి చెందాడు. కేపీహెచ్బి కాలనీలోని మొగుల్స్ ప్యారడైజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి బిర్యానీ కోసం భవన నిర్మాణ కార్మికుడైన రాజేష్ మొగుల్స్ ప్యారడైజ్ కు వెళ్లాడు. దుకాణం సెల్లార్ లోకి వెళ్లడంతో అక్కడ సిబ్బంది దొంగ అనుకున్నారు.
తీవ్రగాయాలపాలై....
హోెటల్ సిబ్బంది రాజేష్ పై దాడి చేశారు. చితక బాదారు. ఈ ఘటనలో రాజేష్ కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులలకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన రాజేష్ ను తీసుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లగా అక్కడ మరణించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story