Mon Dec 23 2024 04:55:14 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోరం.. యువడాక్టర్ పై గ్యాంగ్ రేప్
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలపై అత్యాచారానికి కొందరు దుండగులు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం జరిపారు
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలపై అత్యాచారానికి కొందరు దుండగులు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం జరిపారు. తమిళనాడులోని వేలూరు సత్వచ్చారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. వేలూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న యువతి తన స్నేహితులతో కలసి సెకండ్ షో సినిమాక వెళ్లింది. సినిమా చూసిన అనంతరం షేర్ ఆటోలో తన నివాసానికి యువతి బయలుదేరింది.
స్నేహితుడిపై దాడి చేసి....
అయితే ఆటోలోని నలుగురు యువకులు యువతిపై కన్నేసి ఆటోను దారి మళ్లించారు. ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతితో ఉన్న ఆమె స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ సాయంతో ఆటో నెంబరు ట్రేస్ చేసి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Next Story