Mon Dec 23 2024 16:54:55 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. నాలుగేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. రేవా జిల్లాలో 22 ఏళ్ల యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. రేవా జిల్లాలో 22 ఏళ్ల యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్ర సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల పాపకు పొరుగింట్లో ఉంటోన్న యువకుడు ఏదో సాకుతో తన వద్దకు రప్పించాడు. ఆ తర్వాత తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. కొద్దిసేపటికి బాలిక ఏడూస్తూ.. నొప్పితో విలపిస్తూ బయటికి వచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో....
పాపకి ఏమైందోనని కంగారుపడిన తల్లి.. పరీక్షగా చూసింది. విషయం అర్థమైంది. సోమవారం పాప కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఇన్ స్పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. నిందితుడిపై వివిధ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిలీప్ చెప్పారు. కాగా.. బాలిక ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల వార్డులో చికిత్స పొందుతుండగా.. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఆస్పత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ అతుల్ సింగ్ పేర్కొన్నారు.
Next Story