Mon Dec 23 2024 09:43:54 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగేళ్ల బాలిక ప్రాణాలు తీసిన ఐదు రూపాయల నాణెం.. తీవ్ర విషాదం
బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర వారం రోజుల
భోధన్ పోచంపల్లిలో నాలుగేళ్ల బాలిక ఐదు రూపాయల నాణెం మింగడంతో గొంతులో ఇన్ఫెక్షన్ సోకడంతో మృతి చెందింది. భోధన్ పోచంపల్లి వెంకటరమణ కాలనీకి చెందిన మహేష్, సరిత దంపతుల కుమార్తె బొంగు చైత్ర ఐదు రూపాయల నాణెం మింగిన 15 రోజులకుగా మృతి చెందింది. బాలిక నాణెం మింగడంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆమె గొంతులోంచి నాణేన్ని బయటకు తీశారు. అయితే గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె మళ్లీ అస్వస్థతకు గురైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది. ఆ కాయిన్ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో ప్రమాదం తప్పిందని భావించారు. కానీ చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
Next Story