Thu Dec 19 2024 06:25:19 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం
వైసీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు
వైసీపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం కామవరపు కోట మండలం ఆడమిల్లి గ్రామంలో విద్యుత్తు స్థంభాన్ని ఢీకొట్టింది.
బెలూన్లు ఓపెన్ కావడంతో...
అయితే ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే ఎలీజాతో పాటు ఆయన కుటుంబ సభ్యలు సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. అదుపు తప్పి కరెంట్ పోల్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
Next Story