Mon Dec 23 2024 09:45:14 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు రోజుల పరిచయానికే వీడియో కాల్.. యువకుడికి యువతి బ్లాక్ మెయిల్
గచ్చిబౌలికి చెందిన 26 ఏళ్ల యువకుడు ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్ స్టా గ్రామ్ లో ఓ యువతితో..
సోషల్ మీడియా ప్లాట్ ఫాం లు సైబర్ నేరాలకు ఆస్కారమవుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ. ఆమె తియ్యని మాటలకు యువకుడు ఫ్లాట్ అయ్యాడు. నాలుగు రోజుల పరిచయానికే వీడియో కాల్ మాట్లాడుకున్నారు. అది కూడా న్యూడ్ గా. సీన్ కట్ చేస్తే.. ఆ న్యూడ్ కాల్ రికార్డ్ చేసిన యువతి యువకుడికి పంపి.. డబ్బులివ్వాలని బెదిరిస్తోంది. ఆమె వేధింపులు తట్టుకోలేక బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
గచ్చిబౌలికి చెందిన 26 ఏళ్ల యువకుడు ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్ స్టా గ్రామ్ లో ఓ యువతితో పరిచయం ఏర్పడి.. అది క్రమంగా ఫోన్ నంబర్లు మార్చుకుని వీడియోకాల్స్ మాట్లాడుకునేంతవరకూ వెళ్లింది. యువకుడు తనను పూర్తిగా నమ్మాడని భావించిన యువతి తన ప్రణాళికను మెల్లగా అమలు చేయసాగింది. తొలుత వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడింది. మరోసారి దుస్తులు పూర్తిగా విప్పేసి కాల్ చేసింది. అతడిని కూడా దుస్తులు తొలగించమని కోరింది. అమ్మాయే అలా మాట్లాడితే తానేం తక్కువ కాదని అనుకున్నాడో ఏమో! ఆమె అడిగిందే తడవుగా దుస్తులు విప్పేసి చాలాసేపు మాట్లాడాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న మాయలేడి ఆ వీడియోను క్యాప్చర్ చేసింది.
ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టింది. న్యూడ్ వీడియోలను అతనికి పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది. మొదట రూ.5 వేలు, తర్వాత రూ.10 వేలు పంపాలని మేసేజ్ లు పంపింది. యువతి వేధింపులు భరించలేక ఆ యువకుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story