Sun Dec 22 2024 22:26:01 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ లో యువకుడి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.. అసలేం జరిగిందంటే
ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఘోరమైన చావును కూడా చవి చూసి ఉంటారు. అలాంటి విషయాలు కూడా తెలుసు.
శంషాబాద్ : సెల్ఫీ సరదా ఎంతో మందికి ఊహించని ప్రమాదాలను తెచ్చిపెట్టింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం.. అయినా కూడా కొందరు అసలు పట్టించుకోరు. తమ పిచ్చిలో తాము ఉంటామని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి వలన ప్రాణాలే కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఏవైనా ఎత్తైన ప్రదేశాల వద్ద సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నిస్తూ జారిపడి పోయిన వాళ్ల శవాలు కూడా దొరకని పరిస్థితుల గురించి మనం వార్తల్లో చదివే ఉంటాం. ఇంకొందరు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఘోరమైన చావును కూడా చవి చూసి ఉంటారు. అలాంటి విషయాలు కూడా తెలుసు. అయితే ఓ యువకుడు రైల్వే పట్టాలపై సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
సెల్ఫీ సరదా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ యువకుడి ప్రాణాలను తీసింది. రైల్వే పట్టాలపై సెల్ఫీ వీడియో తీసుకుంటున్న అరుణ్ కుమార్ అనే యువకుడిని ఢీకొట్టింది రైలు. దీంతో ఘటనా స్థలంలోనే సదరు యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. సంఘటనా స్థలంలోనే సదరు యువకుడు మృతి చెందాడని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story