Mon Dec 23 2024 00:20:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. యువకుడి ఆత్మహత్య
కొంతకాలంగా శివప్రసాద్ ఓ యువతితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. శివ ప్రసాద్ ప్రేమ పేరుతో డబుల్ గేమ్ ఆడటం..
సినిమా తరహాలో ఓ యువకుడు ఒక యువతితో సహజీవనం చేస్తూనే మరో యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. అసలు విషయం ఇద్దరు యువతు లకు తెలిసిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది
కర్నూలు జిల్లాకు చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడు ఫిలింనగర్ లోని దుర్గ భవాని నగర్ బస్తీ లో అద్దెకు అంటూ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా శివప్రసాద్ ఓ యువతితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. శివ ప్రసాద్ ప్రేమ పేరుతో డబుల్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. శివ ప్రసాద్ ఒకవైపు ఓ యువతితో సహజీవనం చేస్తూనే.. మరోవైపు తాను పని చేస్తున్న హాస్పిటల్లో ఓ నర్సును ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అంతే కాదండోయ్ ఈ శివప్రసాద్ యువతిని నమ్మించేందుకు తన ఛాతి పై ఆమె ఫోటో, పేరును పచ్చ బొట్టుగా వేయించుకు న్నాడు. అది చూసిన ఆ యువతి శివప్రసాద్ ప్రేమ బుట్టలో పడిపోయింది.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం శివప్రసాద్ ఛాతిపై పచ్చబొట్టు గమనించిన తొలి ప్రేయసి, అతనితో పాటు సహజీవనం చేస్తున్న యువతి శివప్రసాద్ ను నిలదీసి అడిగింది. శివప్రసాద్ చెప్పిన సమాధానం విన్న వెంటనే ఆ యువతి ఆగ్రహంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. శుక్రవారం శివప్రసాద్ తాను పనిచేస్తున్న హాస్పిటల్ కి వెళ్లి రెండో యువతిని పెళ్లి చేసుకుందామని కోరాడు. అయితే అప్పటికే నిద్ర మాత్రలు మింగిన అతడి మొదటి ప్రియురాలి గురించి రెండవ ప్రియురాలికి తెలిసిపోయింది. దీంతో రెండవ ప్రియురాలు పెళ్ళికి నిరాకరించింది. ఇద్దరు యువతులు తనను నిరాకరించడంతో శివప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురై శనివారం తెల్లవారుజామున తన గదిలోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తొలి ప్రేయసి కోలుకోవడంతో ఆమెను పోలీసులు రెస్క్యూ హోమ్ కు తరలించారు.
Next Story