Mon Dec 23 2024 02:50:39 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి కావడం లేదన్న బాధతో యువకుడి ఆత్మహత్య
వయసు మీదపడుతున్నా పెళ్లి కాదు. రకరకాల కారణాల వల్ల సమాజంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. పాతికేళ్లైనా..
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో.. ఎన్నో స్వప్నాల వేడుక. కొందరికి పెళ్లి వరమైతే.. మరికొందరికి శాపమవుతుంది. లక్షలకట్నాలు, తులాల కొద్దీ బంగారం ఇచ్చినా.. వరకట్నం దాహం తీరక భార్యను నానా హింసలు పెట్టి.. ఆఖరికి తనకు తానే ప్రాణాలు తీసుకునేలా చేసే భర్తలున్నారు. అంతా అయిపోయాక మరో పెళ్లికి కూడా రెడీ అయిపోతారు. కొందరికైతే.. వయసు మీదపడుతున్నా పెళ్లి కాదు. రకరకాల కారణాల వల్ల సమాజంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. పాతికేళ్లైనా నిండకుండానే పెళ్లిళ్లు చేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. ఓ యువకుడు తనకు ఎంతకూ పెళ్లి కావట్లేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సన్యాసపాలెం గ్రామంలో మురళీ వయసు 37 సంవత్సరాలు. ఇంత వయసొచ్చినా.. ఇంకా వివాహం కాలేదు. ఊర్లో కూడా.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని ఎగతాళి చేసేవారు. వయసు పెరుగుతుండటంతో.. ఇక తనకు వివాహం కాదన్న బాధతో మురళి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళీ మృతి చెందాడు. పెళ్లి కావడంలేదన్న ఒకే ఒక్క కారణంతో అతను ఇంతటి ఘాతుకానికి పాల్పడటంతో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Next Story