Mon Dec 23 2024 03:23:18 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియురాలు మోసం చేసిందంటూ.. యువకుడి ఆత్మహత్య
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ యువతి తనతో మాట్లాడుతూనే.. మరొకరితో కూడా ప్రేమాయణం సాగించిందని..
తాను ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పేర్కొంటూ.. ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయులు (25) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు గల కారణాన్ని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
కర్నూల్ కు చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించానని, పెళ్లికూడా చేసుకుందామనుకున్నామని తెలిపాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ యువతి తనతో మాట్లాడుతూనే.. మరొకరితో కూడా ప్రేమాయణం సాగించిందని వాపోయాడు. తాను డాక్టర్ డిగ్రీ పొందాక తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పిందని, తమ తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకుంటే తనను దారుణంగా మోసం చేసిందన్నాడు. అలాంటి అమ్మాయిని ప్రేమించి, మోసపోయి బతకలేనని, అందుకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆంజనేయులు బలవన్మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story