Sat Dec 21 2024 02:24:30 GMT+0000 (Coordinated Universal Time)
తల్లిదండ్రులు సహా నలుగురిని నరికిన చంపిన యువకుడు
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కేశవ్.. నిత్యం ఆ మత్తులోనూ ఊగుతుండేవాడు. నిందితుడు ఇటీవలే డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుండి
దేశ రాజధాని ఢిల్లీలో వరుస దారుణాలు వెలుగుచూస్తున్నాయి. శ్రద్ధ హత్య కేసులో పూర్తివివరాలు తెలియకముందే.. మరో నలుగురి హత్యోదంతం కలకలం రేపింది. ఓ యువకుడు తన తల్లిదండ్రులు సహా సోదరి, అమ్మమ్మను నరికి చంపేశాడు. మంగళవారం రాత్రి 10.31 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కేశవ్ (25) అనే యువకుడు తన కుటుంబ సభ్యుల్ని హతమార్చాడు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కేశవ్.. నిత్యం ఆ మత్తులోనూ ఊగుతుండేవాడు. నిందితుడు ఇటీవలే డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుండి విడుదలయ్యాడు. తనను అడిక్షన్ సెంటర్ కు పంపిన కుటుంబ సభ్యులపై కోపంతో దాడి చేశాడు. తండ్రి దినేష్ కుమార్ (42), తల్లి ధర్శన్ సైనీ (40), అమ్మమ్మ దీవానో దేవి (75), చెల్లెలు ఊర్వశి (22) లను కత్తితో బలంగా పొడిచాడు. దాంతో వారంతా అక్కడిక్కడే మరణించారు.
తొలుత తండ్రిని హతమార్చిన అతడు.. అనుమానం రాకుండా బాత్ రూమ్లో మృతదేహాన్ని ఉంచాడు. అనంతరం అమ్మమ్మను, ఉద్యోగం నుండి ఇంటికొచ్చిన తల్లిని, చివరిగా చెల్లెల్ని చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ కలహాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేశవ్ ను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.
Next Story