Mon Dec 23 2024 17:38:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. తమ్ముడు కేకలు వేయడంతో..
గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం
చిన్నారులు, యువతులు, మహిళల కోసం ఎన్ని చట్టాలను అమల్లోకి తెచ్చినా.. ఎంతమందికి కఠిన శిక్షలు వేసినా కామాంధుల ఆలోచనలో మాత్రం మార్పు రావడంలేదు. క్షణికానందం కోసం.. కంటికి కనిపించిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడి.. జైలుపాలవుతున్నారు. ఫలితంగా అటు బాధితులు, ఇటు నిందితులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అభం - శుభం ఎరుగని ఆరేళ్ల పసిమొగ్గపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు.
గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం అత్యాచారానికి యత్నించాడు. తన అక్కపై ఎవరో దాడి చేస్తున్నారని గమనించిన బాలిక తమ్ముడు బిగ్గరగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై నేడు ఊర్లో పెద్దమనుషుల పంచాయతీ నిర్వహించగా.. కిషోర్ చేసిందంతా వివరించి చెప్పాడు. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి.. ఛీ నువ్వు మనిషివేనా.. అంటూ అతనికి దేహశుద్ధి చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Next Story