Mon Dec 23 2024 01:17:10 GMT+0000 (Coordinated Universal Time)
కోడికత్తితో యువతిపై దాడి
ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్న యువకుడు యువతితో పాటు ఆమె తల్లితో పాటు దాడి చేశాడు.
ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్న యువకుడు యువతితో పాటు ఆమె తల్లితో పాటు దాడి చేశాడు. అనకాపల్లి అచ్యుతాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలేనికి చెందిన చేపల నానాజీ నాలుగేళ్ల నుంచి యువతి వెంట ప్రేమిస్తున్నాంటూ పడుతున్నాడు. అంతే కాకుండా ఆ యువతితో తన పెళ్లి అయిందని చెప్పి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టాడు.
ప్రేమకు నిరాకరించడంతో...
ప్రేమ, పెళ్లికి యువతి నిరాకరించడంతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. అయితే రాత్రి వేళ ఇనుప రాడ్డు, కోడికత్తితో యువతిపై దాడి చేశాడు. నానాజీ చేసిన చేసిన దాడిలో యువతి తల్లి కూడా గాయపడింది. అయితే స్థానికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story