Mon Dec 23 2024 23:56:47 GMT+0000 (Coordinated Universal Time)
నాలుక కోసేసుకున్న యువతి.. ఎందుకంటే..!
గురువారం నాడు స్థానికంగా ఉండే కాళీమాత అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలోని బడా అనే గ్రామంలో ఓ యువతి తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పిచింది. ఆ యువతి చేసిన పని అందరూ షాకయ్యారు. సిహవాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్కుమారీ పటేల్ అనే యువతి గుడిలో నాలుక కోసి అమ్మవారికి సమర్పించింది. సమాచారం అందిన వెంటనే గ్రామంలోని పలువురు మహిళలు, పురుషులు తరలివచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాలికను బంధువులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
గురువారం నాడు స్థానికంగా ఉండే కాళీమాత అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని అమ్మవారి విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తులంతా షాకయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువతికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పగా తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామంలో నాలుక కోసుకున్నారనే వార్త అగ్నిలా వ్యాపించడంతో మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రాంగణం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఆలయం సమీపంలో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండగా, సమాచారం అందుకున్న అమీలియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో బాలిక ఆలయానికి వచ్చిన సమయం తమకు తెలియదని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ మూఢనమ్మకాలను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
Next Story