Thu Dec 26 2024 16:30:21 GMT+0000 (Coordinated Universal Time)
నల్గొండ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణమా!
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టగడ్డ గ్రామానికి చెందిన యువతి
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టగడ్డ గ్రామానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి బంధువులు పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకున్నారు.
నాగు అనే వ్యక్తి బాధితురాలిని ప్రేమ నెపంతో వేధించి చివరకు హత్య చేశాడని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేశారు. నిరసనలు చెలరేగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
Next Story