Mon Dec 23 2024 04:39:24 GMT+0000 (Coordinated Universal Time)
కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
పాయల్ ను ఆపేందుకు ఆమె స్నేహితురాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం..
మాదాపూర్ దుర్గం చెరువు వద్ద విషాద ఘటన జరిగింది. గురువారం సాయంత్రం ఓ యువతి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతురాలు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్ (17)గా గుర్తించారు. ఉద్యోగం కోసం నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చిన పాయల్.. స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నడుస్తూ.. ఒక్కసారిగా పై నుంచి చెరువులోకి దూకేసింది.
పాయల్ ను ఆపేందుకు ఆమె స్నేహితురాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. లేక పోలీసులు పాయల్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. కాగా.. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. యువతి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
Next Story