Wed Mar 26 2025 16:54:03 GMT+0000 (Coordinated Universal Time)
పాము కాటుతో యువకుడి మృతి
జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. న

జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. నర్మెట్ట మండలం వెల్డండ గ్రామానికి చెందిన కాసర్ల కరుణాకర్ అనే యువకుడు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి వేళ ఘాడ నిద్రలో ఉన్న సమయంలో కరుణాకర్ పాముకాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించేలోపే కరుణాకర్ మృతిచెందాడు. కరుణాకర్ మృతితో అతడి కటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
Next Story