Mon Dec 15 2025 00:12:11 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో గొడవ.. ఏకంగా యువకుడి హత్య
సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. పలు అంశాలను బట్టి తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది.

సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. పలు అంశాలను బట్టి తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు అప్పటికప్పుడు తిట్టుకొని మరచిపోయే వాళ్లు ఉంటారు. ఇంకొందరు మరీ పర్సనల్ గా తీసుకుని భౌతిక దాడులు చేసుకునే దాకా వెళుతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన యువకుడిని హత్య చేసిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. నితిన్, మను అనే ఇద్దరు కలిసి బెరేష్ (23)ని హత్య చేశారు. మైసూరు జిల్లా హున్సూర్ పట్టణంలోని సరస్వతి ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నితిన్‌పై బీరేష్ చెడు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ద్వేషం పెంచుకున్న నితిన్, మను కలిసి బెరేష్ను కత్తితో పొడిచి చంపారు. కత్తితో దాడి చేయడంతో బీరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కేఆర్ ఆస్పత్రిలో చికిత్సకు పంపించారు. చికిత్స తీసుకుంటూ బీరేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై హున్సూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
Next Story

