Tue Mar 25 2025 04:59:14 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసు.. పులివెందుల నుంచి కడపకు బదిలీ
ఇకపై కేసు విచారణ కడప జిల్లా కోర్టులో జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ తదితర అంశాలన్నీ కడప జిల్లా కోర్టులోనే..

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ చేసింది మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. ఇకపై కేసు విచారణ కడప జిల్లా కోర్టులో జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ తదితర అంశాలన్నీ కడప జిల్లా కోర్టులోనే పరిశీలించబడతాయని మెజిస్ట్రేట్ తెలిపింది. కాగా.. వివేకా హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న నలుగురు పులివెందుల కోర్టుకు హాజరయ్యారు. సీబీఐకి నిందితుల రిమాండ్ ను పొడిగిస్తూ.. మెజిస్ట్రేట్ ఆదేశించింది.
ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులో ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
Next Story