Mon Dec 23 2024 10:32:29 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ కార్యకర్త దారుణ హత్య
భూ తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి..
పట్టపగలు వైసీపీ కార్యకర్త హత్యతో కడప నగరం ఉలిక్కిపడింది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి వైసీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిని కత్తితో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. భూ తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి.. కొందరు వ్యక్తులతో భూ తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జిమ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న శ్రీనివాసులుపై బుర్ఖాధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కత్తులతో దాడిచేశారు.
తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ ఆసుపత్రికి చేరుకని శ్రీనివాసులు హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Next Story